చిరు- త్రివిక్రమ్ కాంబోలో బ్యూటీఫుల్ లవ్‌ స్టోరీ.. ఇది మరో జన్మ అంటూ

by Prasanna |   ( Updated:2023-10-04 09:44:25.0  )
చిరు- త్రివిక్రమ్ కాంబోలో బ్యూటీఫుల్ లవ్‌ స్టోరీ.. ఇది మరో జన్మ అంటూ
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. చిరు ‘జై చిరంజీవ’ సినిమాకు కథ, మాటలు రాసిన త్రివిక్రమ్ తర్వాత మెగాఫోన్ పట్టి స్టార్ డైరెక్టర్ అయిన సంగతి తెలిసిందే. కాగా త్రివిక్రమ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చిరుతో మూవీ చేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఒక ఈవెంట్‌లో మెగాస్టార్‌తో మూవీ తప్పకుండా చేస్తానని స్వయంగా తివిక్రమ్ ప్రకటించారు. అయితే ఇన్నాళ్లకు వీరిద్దరి కలయికలో ఓ లవ్‌ స్టోరీ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. చిరు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 1983 ‘ఖైదీ’కి సీక్వెల్‌గా తివిక్రమ్ ఓ అద్భుతమైన కథ రాశారని, క్లైమాక్స్‌లో ఉండే ‘ఈ జన్మ పగ తీర్చుకోవడానికే. ప్రేమించడానికి మరో జన్మ ఎత్తుతాను’అనే డైలాగు ఆధారంగానే స్టోరీని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీ ఉండటం వల్ల ఈ నయా ప్రాజెక్ట్ పట్టాలేక్కాలంటే కాస్త సమయం పడుతుందని సమాచారం.

Read More: సల్మాన్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘టైగర్ 3’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Advertisement

Next Story