‘దేవర’ నుంచి ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త..

by Kavitha |   ( Updated:2024-03-16 05:12:42.0  )
‘దేవర’ నుంచి ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త..
X

దిశ, సినిమా: తారక్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తున్నాడు. ఇక రెండు భాగాలుగా రానున్నా ఈ సినిమా తొలిభాగం 2024 అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫ‌స్ట్‌లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. కానీ ఈ మూవీ షూట్ మొదలైనప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.సైఫ్ అలీ ఖాన్ కు గాయం కావడం, అనిరుధ్ అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వకపోవడం ‘దేవర’ మేకర్స్‌ను ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికి అంతకంత షూటింగ్ ఫాస్ట్‌గా పూర్తి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.. ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుందని సమాచారం అందుతోంది. అంతే కాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని నోరా ఫతేహి ఆ స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్. తారక్‌తో ఇంతకు ముందు ‘టెంపర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన నోరా ఫతేహి చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘దేవర’ లో మూవీలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వార్తలపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed