నిఖిల్‌ను ఈ క్లబ్‌లో ఊహించి ఉండరు..

by sudharani |
నిఖిల్‌ను ఈ క్లబ్‌లో ఊహించి ఉండరు..
X

దిశ, సినిమా: నిఖిల్-చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'కార్తికేయ 2'. ఎన్నో ఆటంకాలను అధిగమించి రిలీజైన చిత్రం.. కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంది. అనుకోకుండా హిందీ వెర్షన్‌లో భారీగా ఆడిన చిత్రం.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుంది. కాగా టాలీవుడ్‌లో ఇప్పటిదాకా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు 11 మంది మాత్రమే.

ఇందులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి ఇప్పటికే ఉండగా.. రీసెంట్‌గా 'ఎఫ్‌3'తో వెంకటేష్, వరుణ్.. 'గీతా గోవిందం'తో విజయ్ దేవరకొండ..'అఖండ'తో నందమూరి బాలయ్య కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. ఇక ఇలాంటి అరుదైన క్లబ్‌లో నిఖిల్ చేరతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ 'కార్తికేయ-2' సక్సెస్‌తో ఈ మ్యాజిక్ మార్కును చేరుకోగలిగాడు. దీంతో ఇప్పటి వరకు బడా హీరోలకే సాధ్యమైన వంద కోట్ల క్లబ్‌లో నిఖిల్ చేరడంతో అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. కంటెంట్ ఉంటే చిన్న హీరోలు కూడా వంద కోట్ల కబ్‌లో చేరడం సాధ్యమేనని రుజువు చేసిన నిఖిల్‌ను అభినందిస్తున్నారు.

Advertisement

Next Story