అమితాబ్ దేవునితో సమానం: ఇంటి ముందు విగ్రహం ప్రతిష్టించిన వ్యక్తి

by Hajipasha |   ( Updated:2022-08-31 13:50:39.0  )
అమితాబ్ దేవునితో సమానం: ఇంటి ముందు విగ్రహం ప్రతిష్టించిన వ్యక్తి
X

దిశ, సినిమా: భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన బిగ్ బి విగ్రహాన్ని తాజాగా ఓ ఇండో-అమెరికన్ తన ఇంటిముందు పెట్టుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. గుజరాత్‌కు చెందిన గోపి అనే వ్యక్తి న్యూజెర్సీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. రీసెంట్‌గా తన ఇంటి వెలుపల అమితాబ్ ప్రతిమను ఏర్పాటు చేసిన సదరు వ్యక్తి సంబంధిత ఫొటోలను ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు.

అంతేకాదు 'అమితాబ్ నా భార్యకు దేవుడి కంటే తక్కువ కాదు. అతని జీవితం మా కుంటుంబానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. అట్టడుగు స్థాయినుంచి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఇప్పటికీ తన అభిమానులను జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే నా ఇంటి వెలుపల అతని హోదా చూపించాలని అనుకున్నాను' అని వెల్లడించాడు. ఇక ఈ విగ్రహానికి సుమారు ₹60 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పిన గోపి.. ముప్పై ఏళ్లుగా 'బిగ్ బి ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ' కోసం www.BigBEFamily.com అనే వెబ్‌సైట్‌ నడుపుతున్నట్లు తెలపడం విశేషం.

Advertisement

Next Story