సుశాంత్ లాగే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న : Amit Sadh

by sudharani |   ( Updated:2022-12-23 10:19:08.0  )
సుశాంత్ లాగే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న : Amit Sadh
X

దిశ, సినిమా : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంతో భారీ షాక్‌‌కు గురైనట్లు నటుడు అమిత్ సాద్ తెలిపాడు. అంతేకాదు తాను గతంలో నాలుగుసార్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించి అభిమానులను ఆశ్యర్యానికి గురిచేశాడు. రీసెంట్‌గా సుశాంత్ డెత్ మిస్టరీని తలచుకుంటూ భావోద్వేగానికి లోనైన అమిత్.. ఎవరూ ఊహించని అతని చావు తననెంతో ప్రభావితం చేసిందని, ఈ భయంకరమైన సంఘటనతో సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకున్నట్లు చెప్పాడు. 'సుశాంత్ చనిపోవడానికి 4 నెలల ముందు అతనితో మాట్లాడాలని ఓ స్నేహితుడిని నెంబరు అడిగా.

కానీ, తనగురించి ఏవేవో విషయాలు వినిపిస్తున్న కారణంగా మోబైల్ వాడటం మానేశాడని చెప్పాడు. కొత్త నెంబరు తీసుకోగానే పంపిస్తానని చెప్పినా వినకుండా సుశాంత్ ఇంటికి తీసుకెళ్లమని అడిగా. తను ఒప్పుకోలేదు. వెంబడించాలని మనసులో ఉన్నా ఆ సాహసం చేయలేకపోయా' అంటూ ఆవేదన చెందాడు. అయితే సుశాంత్‌ని కలవలేకపోయానన్న అపరాధ భావం అలాగే ఉండిపోయిందన్న నటుడు.. తాము క్లోజ్ ఫ్రెండ్స్ కానప్పటికీ, రాజ్‌పై అపారమైన ప్రేమ ఉందన్నాడు. తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే కోపం వస్తుందన్నాడు. చివరగా 16-18ఏళ్ల మధ్య నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానన్న అమిత్.. ఈ అనుభవం వల్ల ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడో బాగా తెలుసంటూ ముగించాడు.



Advertisement

Next Story