అమీర్ ఖాన్ కూతురి పెళ్లి.. వెడ్డింగ్ డే అండ్ ఫుడ్ ఫుల్ డీటెయిల్స్

by sudharani |   ( Updated:2023-12-29 14:33:42.0  )
అమీర్ ఖాన్ కూతురి పెళ్లి.. వెడ్డింగ్ డే అండ్ ఫుడ్ ఫుల్ డీటెయిల్స్
X

దిశ, సినిమా : మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. జనవరి 3న జరిగే గ్రాండ్ వెడ్డింగ్ సెరమనీలో లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ నూపుర్ శిఖారేతో ఏడడుగులు వేయనుంది. మరాఠీ సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అమీర్ ఎక్స్ వైఫ్ కిరణ్ రావ్ దగ్గరుండి చూసుకుంటుంది. బంద్రాలోని తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్స్ లో పెళ్లి జరగనుండగా.. అనంతరం జనవరి 6, జనవరి 9న ఢిల్లీ, జైపూర్ లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్న పెళ్లిలో వంటకాలు హైలైట్ కానున్నాయి. దేశంలోని అన్ని సంప్రదాయాలను అనుసరించి భోజనంలో వెరైటీ ఐటమ్స్ ప్లాన్ చేస్తున్నారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఔట్ ఫిట్ తో పాటు మతుంగ జువెల్లరీ ధరించనుంది పెళ్లి కూతురు.

Read More..

మహేష్​బాబు న్యూయర్ వేడుకలు అక్కడే

Advertisement

Next Story