‘గదర్ 2’ వివాదం.. అమీషా ఆరోపణలపై నిర్మాత రియాక్షన్ ఇదే.. మంచి పని చేసిందిలే అంటూ..

by samatah |   ( Updated:2023-07-07 10:03:13.0  )
‘గదర్ 2’ వివాదం.. అమీషా ఆరోపణలపై నిర్మాత రియాక్షన్ ఇదే.. మంచి పని చేసిందిలే అంటూ..
X

దిశ, సినిమా: అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తనను ఇబ్బంది పెట్టిందనే అమీషా పటేల్ ఆరోపణలపై చిత్ర నిర్మాత అనిల్ శర్మ స్పందించాడు. చండీఘఢ్ ‘గదర్ 2’ సెట్స్‌లో తనను అసలే పట్టించుకోలేదని, ఫుడ్ ఇతరత్ర అవసరాలు కూడా తీర్చలేదంటూ ట్వీట్ చేసింది అమీషా. అయితే ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అనిల్.. ‘ఆమె ఇదంతా ఎందుకు చెప్పిందో నాకు అంతుబట్టడం లేదు. ఇదంతా అబద్ధం. అదే సమయంలో అమీషాకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ రకంగానైనా నా ప్రొడక్షన్ హౌస్‌కి పేరు తెచ్చింది’ అంటూ నటి ఆరోపణలు కొట్టిపారేశాడు. ఇక ఈ మూవీ నుంచి అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తప్పుకున్న తర్వాత జీ స్టూడీయోస్ నిర్మాణ బాధ్యతలు తీసుకోగా ఆగస్టు 11న సినిమా రిలీజ్‌ కానుంది.

Read More: విజయ్ దేవరకొండతో విడిపోతున్న Rashmika Mandanna ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Advertisement

Next Story