Radhika Marchant : సమంతను కాపీ కొట్టిన అంబానీ కోడలు.. ఎలా అంటే?

by Jakkula Samataha |
Radhika Marchant : సమంతను కాపీ కొట్టిన అంబానీ కోడలు.. ఎలా అంటే?
X

దిశ, సినిమా : అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తాజాగా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని చాలా ఘనంగా జరిపించారు. ఇప్పటికీ ఆ వివాహానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం తర్వాత, రాధికకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే, అంబానీ కోడలు సమంతను కాపీ కొట్టిందంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం సమయంలో వారు ధరించిన ఆభరణాలు, దుస్తుల గురించిన సమాచారం తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గౌన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె అనంత్ పై ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూ.. తన అనంత్ రాసిన ప్రేమ లేఖలను తన ఫ్రీ వెడ్డింగ్ గౌన్ పై డిజైన్ చేయించింది. బ్లాకెన్ వైట్‌లో కనిపించే ఆ డ్రెస్ చూడనీకి చాలా అందంగా కనిపిస్తుంటుంది. అలాగే సమంత కూడా తన నిశ్చితార్థం సమయంలో, నాగచైతన్య, తన ప్రేమ కథను,ఫోటోలను తన ఎంగేజ్మెంట్ చీరపై ఎంబ్రాయిడరీ రూపంలో డిజైన్ చేయించింది. అప్పుడు అందరూ దాని గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. చైతూ పై సమంతకు ఉన్న ప్రేమకు తన అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు రాధిక ఫ్రీ వెడ్డింగ్ గౌన్ పై అనంత్ అంబానీ ప్రేమ లేకలను డిజైన్ చేయడం సమంత ఐడియానే కాపీ కొట్టినట్లు ఉంది అని పలువురు ముచ్చటించుకుంటున్నారు.

Advertisement

Next Story