కొడుకు మాటలకు కన్నీరు పెట్టుకున్న అంబానీ.. (వీడియో)

by Mahesh |   ( Updated:2024-03-05 16:46:24.0  )
కొడుకు మాటలకు కన్నీరు పెట్టుకున్న అంబానీ.. (వీడియో)
X

దిశ, సినిమా: మాములుగానే డబ్బున్నోళ్ల ఇంట్లో పెళ్లి అంటే మామూలుగా ఉండదు. అలాంటిది దేశంలోనే నెం-1 బిజినెస్ మ్యాన్ ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కాగా దేశంలోనే అత్యంత సంపన్నులో ఒకరైన అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. జులైలో అంబానీ కొడుకు అనంత్- రాధిక వివాహం జరగనుండగా.. జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఇక ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధం కాగా 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.

అయితే తాజాగా అంబానీ ఈ మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు.. ‘అతిథులందరికీ స్వాగతం. ఈ వేడుక ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారణం మా అమ్మ. ఆమె రోజుకు 18 గంటలు కష్టపడ్డారు. నా జీవితమేమీ పూల పాన్పు కాదు. ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ టైమ్‌లో అమ్మానాన్న అండగా నిలిచారు. రాధికా నా భార్యగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’ అని అనంత్ తెలిపారు. దీంతో కొడుకు మాటలకు తండ్రి భావోద్వేగానికి గురయి కన్నీరు పెట్టుకున్నాడు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story