- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ రివ్యూ
దిశ, సినిమా : కలర్ ఫొటో సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న నటుడు సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన రైటర్ పద్మభూషన్ లాంటి పలు సినిమాల్లో నటించి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇక ఈయన తాజాగా దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో సోషల్ మెసేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో శరణ్య ప్రదీప్ కీలక పాత్రలో నటించగా, శివాని నాగారం హీరోయిన్‌గా కనిపించింది. ఇక శుక్రవారం( ఈరోజు ) థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం.
మల్లి (సుహాస్) అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి కవల సోదరి పద్మ (శరణ్య ప్రదీప్) ఆఊరి స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తుంటుంది. మల్లీ మ్యారేజీ బ్యాండులో వర్క్ చేస్తూనే, సెలూన్ షాప్‌లో పని చేస్తుంటాడు. ఈ క్రమంలో మల్లీ తన ఊరిలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. వెంకట్ బాబు డబ్బు, అగ్రకులం చాటున చాలా అరాచకాలు చేస్తుంటాడు. తన అక్క లక్ష్మీకి జరిగిన అవమానానికి మల్లీ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? లక్ష్మీపై ప్రేమను పెంచుకొన్న సంజీవీ (జగదీష్)కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తన సోదరిపై దౌర్జన్యం చేసిన వెంకటబాబుకు ఎలాంటి శిక్షను మల్లి విధించాడు అనే ప్రశ్నలకు సమాధానమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ.
ఇక ఈ సినిమా చెప్పడానికి అంత కొత్తగా ఏమీ అనిపించకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డీజైన్ చేసుకున్న విధానం మూవీకి హైలెట్‌గా నిలుస్తాయి. మూవీకి మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్. శేఖర్ చంద్ర తన బీజీఎంతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. అలాగే సుహస్, శరణ్య, శివానీలు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.మూవీ ఫస్ట హాఫ్ కామెడీగా కొన్ని ఎమోషన్స్‌తో సరదాగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్లతో ప్రీ క్లైమాక్స్ వరకు లాక్కొచ్చారనే అనిపిస్తుంది. మొత్తానికి సినిమా పర్వాలేదనిపించిదని టాక్.