ఆ స్టార్ డైరెక్టర్ ముఖం మీద తలుపేసిన అమల.. ఎందుకంటే..?

by Anjali |   ( Updated:2023-08-17 14:13:33.0  )
ఆ స్టార్ డైరెక్టర్ ముఖం మీద తలుపేసిన అమల.. ఎందుకంటే..?
X

దిశ, సినిమా: ‘సిసింద్రీ’ సినిమాతో అక్కినేని అఖిల్ బాల నటుడుగా ఇండస్ట్రీకి పరిచమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు శివ నాగేశ్వరరావుకు అక్కినేని ఫ్యామిలితో మంచి అనుబంధం ఉంది. ఓ రోజు ఆయన ఇంగ్లీష్ కథను అనుసరించి తెలుగులో దానికి సంబంధించిన స్టోరీ రాసుకొని నాగార్జున దగ్గరకు వచ్చాడట. కొడుకు అఖిల్‌ను తన నెక్స్ట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేయాలనుకుంటున్నాను అని అడిగాడట. ఇందులో భాగంగా నెక్స్ట్ డే శివ నాగేశ్వరరావు.. నాగార్జున ఇంటికి వెళ్లి తలుపుకొట్టగా అమల తీసినట్టు తీసి మొహం మీదే తలుపేసిందట. ఎనిమిది నెలల అబ్బాయితో సినిమా ఏంటని అసలు ఒప్పుకోలేదట. కానీ ఏం కాదు చేయనిద్దామని అన్నారట నాగార్జున. ఇక అప్పట్లో ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Advertisement

Next Story