ఆ దాడి తట్టుకోలేక గుండెలవిసేలా ఏడ్చాను.. దాన్నే టార్గెట్ చేశారు

by Hamsa |   ( Updated:2023-05-26 10:17:15.0  )
ఆ దాడి తట్టుకోలేక గుండెలవిసేలా ఏడ్చాను.. దాన్నే టార్గెట్ చేశారు
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న దారుణమైన ట్రోలింగ్‌పై ఓపెన్ అయింది అల్మా హుస్సేన్. కొంతకాలంగా తన పర్సనల్ విషయాల గురించి నెట్టింట చర్చ నడుస్తుందని, కొన్ని వివాదాల కారణంగా మానసికంగా కుంగిపోయానని తెలిపింది. ‘సోషల్ మీడియాకు నటీనటులు చాలా సాఫ్ట్ టార్గెట్. ఏ విధంగానైనా ట్రోలింగ్ చేస్తారు. 19 ఏళ్లపుడే నా వయస్సు గురించి అబద్ధం చెబుతున్నానని ‘నువ్వు అబద్ధాల కోరు’ అంటూ నాతో ఆడుకున్నారు. నన్ను సిగ్గుపడేలా చేశారు. వారి ఉద్దేశ్యం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఒక దశలో ఒంటరిగా కూర్చోని గుండెలవిసేలా ఏడ్చాను. చాలా నిరుత్సాహపడ్డాను. నిజానికి నా తల్లిదండ్రులు లేకుంటే నేను ఇప్పుడిలా ఉండేదానినే కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల ప్రేమ విషయంలో మరోసారి టార్గెట్ అయ్యానన్న నటి.. వాటిని పట్టించుకోకుండా పనిపై దృష్టి పెట్టడం నేర్చుకున్నట్లు చెప్పింది. ‘జీవితం, పని ఆగవు. మీరు ఏకాగ్రతతో ఉండాలి. ఎలాంటి సందర్భాలైనా సరే మిమ్మల్ని కిందకి లాగనివ్వకూడదు’ అని తన ఫాలోవర్లకు సూచించింది.

Also Read: నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ ట్విట్టర్ రివ్యూ.. (వీడియో)

Advertisement

Next Story

Most Viewed