Allu Shirish: బంపర్ ఆఫర్ ప్రకటించిన అల్లు శిరీష్.. బడ్డీ టికెట్ అతి తక్కువ ధరకే పొందవచ్చు (పోస్ట్)

by Hamsa |
Allu Shirish: బంపర్ ఆఫర్ ప్రకటించిన అల్లు శిరీష్.. బడ్డీ టికెట్ అతి తక్కువ ధరకే పొందవచ్చు (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గత రెండేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు బడ్డీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ నిర్మిస్తున్న ఈ సినిమాను శామ్ అంటోన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ మూవీ ఆగస్ట్ 2న తేదీన గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. బడ్డీ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. మూవీ టీమ్ సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. బడ్డీ టికెట్ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయాడు.

సింగిల్ స్క్రీన్‌లో రూ. 99, మల్టీఫ్లెక్స్‌లో రూ.120 మాత్రమే టికెట్ రేట్లు ఉండబోతున్నాయని పోస్టర్ విడుదల చేశాడు. విడుదలకాబోతున్న కొత్త సినిమాలను నిర్మించిన సంస్థలు టికెట్ రేట్లు పెంచుతున్న క్రమంలో బడ్డీ టీమ్ తగ్గించడంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed