Allu Arjun డాన్స్ చూసి చేతిలో వంద రూపాయలు పెట్టిన స్టార్ డైరెక్టర్..

by Prasanna |   ( Updated:2023-08-25 17:38:01.0  )
Allu Arjun డాన్స్ చూసి చేతిలో వంద రూపాయలు పెట్టిన స్టార్ డైరెక్టర్..
X

దిశ, సినిమా: తాజాగా అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడం తో అందరి చూపు ప్రస్తుతం అతని మీదే ఉంది. మొట్టమొదటి సారి టాలీవుడ్ నుండి ఉత్తమ నటుడిగా ఈ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీంతో అభిమానులంతా కూడా పండగ చేసుకుంటున్నారు. ఇక పోతే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే తాజాగా అల్లు అర్జున్ , రాఘవేంద్రరావు కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంటంటే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా వరకు అభిమాన సమక్షంలోనే జరుగుతాయి. అయితే అల్లు అర్జున్ చిన్నతనంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనదైన డాన్స్ తో అందరినీ మెప్పించారట. ఇక అక్కడే ఉన్న రాఘవేంద్రరావు అల్లు అర్జున్ డాన్స్ కి ఫిదా అయ్యి .. అల్లు అర్జున్ తల్లి తో మీ కొడుకు చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు.. వంద రూపాయలు తీసుకోండి అని ఇచ్చారట. అంతేకాదు ‘వీడు పెద్దయ్యాక వీడితో మొదటి సినిమా నేనే ఇస్తాను’ అని అల్లు నిర్మల కి మాట ఇచ్చారట. ఇక మాట ఇచ్చినట్టుగానే.. అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి :

పాన్ ఇండియా స్టార్ Allu Arjun తొలి సంపాదన ఎంతో తెలుసా..?

అదిరిపోయిన పుష్ప-2 రిలీజ్ డేట్.. పదిరోజుల పాటు జాతరే!

Advertisement

Next Story