- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలక్షన్స్ రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న అల్లు అర్జున్.. ఆ అమ్మాయితో కలిసి..!
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కావడంతో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు బన్నీ. అనంతరం కాస్ట్ ఓట్ అంటూ నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఎలక్షన్ల కారణంగా నేడు షూటింగ్ నుంచి కాస్త విరామం దొరకడంతో.. అల్లు అర్జున్ ఓ అమ్మాయికి హెల్ప్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ‘నీకు ఫాలోవర్స్‌ని పెంచేందుకు ఈ వీడియో చేస్తున్న. ఇప్పుడు నీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు..? ఎంత మంది కావాలి..? అని అ అమ్మాయిని అడగ్గా.. ప్రస్తుతం 13 వేల మంది ఉన్నారు. 30 వేల మంది కావాలని ఆ అమ్మాయి చెప్తుంది. సరే మరి.. ఈ వీడియోతో వస్తారా..? అని బన్నీ అడగ్గా.. వస్తారు సర్.. అని అమ్మాయి బదులిచ్చింది. దీంతో అల్లు అర్జున్ గట్టిగా నవ్వి.. సరే రావాలని నేను కూడా కోరుకుంటున్నా’ అంటూ ఆ అమ్మాయితో కలిసి సెల్ఫీ వీడియో చేశాడు బన్నీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బన్నిపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. కాగా.. అల్లు అర్జున్ సెల్ఫీ వీడియో చేసిన అమ్మాయి.. బన్నీ ఇంటి పనిమనిషి అని తెలుస్తోంది.