రామోజీ రావుకు భారతరత్న ఇవ్వాలి.. అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్

by Sujitha Rachapalli |
రామోజీ రావుకు భారతరత్న ఇవ్వాలి.. అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్
X

దిశ, సినిమా: మీడియా మొఘల్ రామోజీ రావు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో ఇటు మీడియా అటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. '50ఏళ్లుగా ఒంటి చేత్తో రామోజీ గ్రూప్ సంస్థలను నడుపుతూ.. కోట్లాది మందికి అన్నం పెడుతున్న ఆయనకు భారత రత్న అందించడమే అసలైన నివాళి ' అని పోస్ట్ పెట్టాడు.

కాగా దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. 'నా మనసులోని మాటను అక్షరాల చెప్పారు సార్. మీరు నా హార్ట్ ను చదివేసినట్లు అనిపించింది. మీ వాయిస్ నాకు ఇలా అందించినందుకు థాంక్స్ ' అని చెప్పాడు. రామోజీ గారి విజినరీ చాలా గొప్పదన్న హీరో.. రామోజీ ఫిల్మ్ సిటీలో పని చేసిన ప్రతిసారి ఆయన ఎనర్జీ ఫీల్ అవుతానని తెలిపాడు. ఆయన కుటుంబం ఆ దేవుడి ఆశీస్సులతో మరింత బలంగా ఉండాలని కోరుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed