- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘పుష్ప 2’ ప్రపంచంలోకి అభిమానులను తీసుకెళ్లిన అల్లు అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్ లో స్పెషల్ వీడియో
దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘ పుష్ప 2 ’ మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇన్ స్టాలో బన్నీ తన దినచర్యను చూపించాడు. ఉదయం లేచినప్పటి నుంచి షూటింగ్ ముగిసే వరకు తాను ఏయే పనులు చేస్తాడో వివరించాడు. ఇంట్లో నుంచి మొదలుకుని.. ‘పుష్ప 2’ సెట్స్ కి వెళ్లే వరకు ఓ టూర్ వేసి చూపించాడు. ఇందులో మూవీ కోసం వేసిన సెట్స్, అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, సెట్లోకి ఎంటరయ్యే విధానం, యాక్షన్ నుంచి కట్ వరకు షూటింగ్ సాగిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ ఫిల్మ్ సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులను చూపిస్తూ.. ‘ఇండియాలో ఫ్యాన్స్ చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. దీనిని వర్ణించలేం’ అంటూ చెప్పిన మాటలు హైలెట్. ఇక సుకుమార్ కూడా ఈ వీడియోలో భాగం కాగా.. లక్షల మంది లైక్, షేర్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.