- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Allu Arjun: వయనాడ్ బాధితులకు స్టైలిష్ స్టార్ ఆర్థిక సాయం.. ఏకంగా రూ.25 లక్షల విరాళం
దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటన దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తులో దాదాపు 358 మంది అభాగ్యులు ప్రాణాలను కోల్పోయారు. 518 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 206 మంది ఆచూకి ఇంకా లభించలేదు. ఈ క్రమంలో ఊహించని విపత్తు కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను కష్టకాలంలో ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ వంత సాయంగా రూ.25 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు.
పుష్ఫ మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌కు కేరళ రాష్ట్రంలోనూ ఓ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అయితే, అక్కడి ఫాన్స్ బన్నిని ఆప్యాయంగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. బన్నికి ఫ్యాన్ బేస్ ఉన్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో కేరళ ఉంది. ఆయన ఏ మూవీ రిలీజ్ అయిన కేరళలో బాక్స్ ఆఫీసులు బద్దలవుతాయంటే అందులో ఏ మాత్రం సందేహం లేదు.