Adipurush :ఆదిపురుష్ సినిమాకు ఆల్ ది బెస్ట్: మంత్రి రోజా

by sudharani |
Adipurush  :ఆదిపురుష్ సినిమాకు ఆల్ ది బెస్ట్: మంత్రి రోజా
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సక్సెస్ కావాలని చాలా మంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి రోజా సైతం మూవీ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘శ్రీరామచంద్రమూర్తి వారు ఒక రాజుగా తన ప్రజలకు మాత్రమే కాకుండా, భూమిపై ఉన్న ప్రతి జీవికి శ్రేయోభిలాషిగా ఉండేవారట! అలాంటి ఆదిపురుషుడైన రామయ్య కథ ఆదిపురుష్‌గా ప్రజల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అంటూ రోజా ట్వీట్ చేశారు.




Advertisement

Next Story