షాక్‌లో సినీ ఇండస్ట్రీ.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఆలీ కుటుంబం!

by sudharani |   ( Updated:2023-06-03 11:56:29.0  )
షాక్‌లో సినీ ఇండస్ట్రీ.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఆలీ కుటుంబం!
X

దిశ, వెబ్‌డెస్క్: కమెడీయన్, సీనియర్ నటుడు ఆలీ గురించి పత్యేకంగా చెప్పనవసరం లేదు. అటూ సినిమాలు, షోలు చేస్తూనే.. రాజకీయ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు ఆలీ. ఇదిలా ఉంటే తాజాగా ఆలీ కుటుంబం ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందంటా. ఈ విషయాన్ని స్వయంగా అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. అసలు ప్రమాదం ఏంటి..? వాళ్లు ఎలా బయటపడ్డారు..? అనే విషయాలు ఈమె ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అదేంటో తెలుసుకుందాం.

ఆమె షేర్ చేసిన వీడియో ఆధారంగా.. జుబేదా అలీ పెద్ద కుమార్తె ఫాతిమా అమెరికా నుంచి, గుంటూరు నుంచి ఫాతిమా అత్తమామలు వచ్చారట. ఇక అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఇలా అందరూ కలిసి ఎయిర్ పోర్ట్‌కు కారులో వెళ్లాము. విమానం ఎక్కిన అనంతరం.. సరదాగా మా ప్రయాణం మొదలైంది అనుకున్న కొంత సమయానికే విమానంలో ఒక అలర్ట్ వచ్చిందని తెలిపారు. బయట భారీ వర్షం కారణంగా విమానం ప్రమాదంలో ఉందని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్నామని క్షేమంగా కిందికి దిగుతామా లేదా అన్న భయం అందరిలో మొదలైందని చెప్పారు.

ఇలా అరగంట పాటు అందరూ కంగారు పడుతూనే ఉన్నామని అనంతరం విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నామని ఈ సందర్భంగా జుబేదా వారికి తప్పిన పెను ప్రమాదం గురించి తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డామని తెలిపిన ఆమె.. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది..? ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియజేయలేదు. ఈ వీడియో చూసిన వాళ్లు మాత్రం కాస్త షాక్‌కు గురయ్యారు.

Also Read: Prabhas : ప్రభాస్ చేసిన ఫస్ట్ యాడ్ ఇదే.. పారితోషకం ఎంత తీసుకున్నాడంటే..?

Advertisement

Next Story