చదువుకునే రోజుల్లో బాత్‌రూమ్‌కి వెళ్లి ఆ పని చేశానంటూ ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-03-15 10:12:43.0  )
చదువుకునే రోజుల్లో బాత్‌రూమ్‌కి వెళ్లి ఆ పని చేశానంటూ ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గత కొద్ది కాలంగా రాణిస్తోంది. అంతేకాకుండా తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా గంగు భాయ్ కతియావాడిలో వేశ్యగా నటించి ప్రశంసలు అందుకుంది. వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉందనగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022 నవంబర్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ పాపకు రాహా అనే పేరు పెట్టింది. కూతురు పుట్టాక ఆలియా భట్ కొద్ది కాలం పాటు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ.. దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ స్కూల్‌లో చదువుకున్నాను. ప్రతి రోజు స్కూలుకు వెళ్లే దాన్ని కానీ క్లాసులు వినే దాన్ని కాదు. బాత్‌రూమ్‌లో నిద్రపోయేదాన్ని. ఈ విషయం మా టీచర్ గమనించి.. నాకు శిక్ష విధించింది. వారం రోజుల పాటు తరగతి గదిలోని బెంచీలను తుడిపించింది. ఈ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. చదువుకునే రోజుల్లో అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Read More..

నెట్టింట హీట్ పెంచుతున్న వర్మ హీరోయిన్ బోల్డ్ ఫొటోలు.. కసి బొమ్మలా చేసావంటూ కామెంట్స్

Advertisement

Next Story