ఇంగ్లీష్ మాట్లాడుతూ విలన్‌గా నటించడం వింతగా అనిపించింది.. అలియా

by samatah |   ( Updated:2023-08-03 08:35:15.0  )
ఇంగ్లీష్ మాట్లాడుతూ విలన్‌గా నటించడం వింతగా అనిపించింది.. అలియా
X

దిశ, సినిమా: ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’ మూవీలో హాలీవుడ్ నటి గాల్ గాడోట్‌తో కలిసి పనిచేసిన అనుభవాలపై అలియా భట్ ఓపెన్ అయింది. ఆగస్ట్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ హాలీవుడ్ చిత్రంలో విలన్ పాత్రను పోషించింది బ్యూటీ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి నటితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం గొప్పగా అనిపించిందని, సెట్‌లోనూ తనకు ప్రతి విషయంలో మద్దతుగా నిలిచినందుకు గాల్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక మొదటిసారి హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ గురించి మాట్లాడుతూ.. ‘నాకు మొదటి రోజు కాస్త ఆందోళన, గందరగోళంగా అనిపించింది. ఎందుకంటే నాకు హిందీలో మాట్లాడటం ఎక్కువ అలవాటు. షూటింగ్ మొదటి రోజే అకస్మాత్తుగా మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడటం కష్టమైంది. ఇంగ్లీషులో మాట్లాడుతూ నటించడం కూడా కొంచెం వింతగా ఉంది. అయితే ఈ మార్పుకు అనుగుణంగా త్వరగానే మారిపోయాను. భాషతో సంబంధం లేకుండా మూవీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఒకేలా ఉంది. సినిమా సెట్‌ వాతావరణం విశ్వవ్యాప్తంగా సేమ్ ఉంటుందని గ్రహించాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: Nabha Natesh : నభా నటేష్ పరువాల విందు... 'ఇస్మార్ట్' పోరి జబర్దస్త్ అందాలు అదరహో!

Advertisement

Next Story