- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోజంతా కౌగిలించుకోవడం, ముద్దులివ్వడానికే సరిపోతుంది.. అలియా కామెంట్స్ వైరల్
దిశ, సినిమా : ప్రతిరోజూ తన కూరుతు రాహాతో చేసే ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ పనులను అభిమానులతో పంచుకుంది అలియా భట్. అంతేకాదు తన బిడ్డతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నానన్న నటి.. ఆమె జన్మించిన తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పింది. ‘రాహా పుట్టిన తర్వాత నా దినచర్య పూర్తిగా మారిపోయింది. ప్రతిరోజూ చేసే వర్కౌట్‌ల విషయంలోనూ ప్రాధాన్యత తగ్గింది. ఇంతకుముందు అనుకున్న పనిని ఈజీగా చేసేదాన్ని. ఇప్పుడు కుదరట్లేదు. నిజంగానే నా జీవితం చాలా మారిపోయింది. నాకు తెలియకుండానే టైమ్ అంతా కుమార్తెతో గడిచిపోతుంది. నా చిన్న పాపను గట్టిగా కౌగిలించుకోవడం, పెద్ద పెద్ద ముద్దులివ్వడమే ఇంపార్టెంట్ అయిపోయింది. ఒక్కసారే కాదు రోజంతా ఇలా చాలా సార్లు చేస్తాను’ అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా తమ బిడ్డపై అభిమాన నటి చూపుతున్న ప్రేమను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
Read More: Aishwarya అసలు క్యారెక్టర్ బయటపెట్టిన Abhishek.. కుటుంబాలే నాశనమయ్యాయంటూ