- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది నిజమని తెలిశాక గుండెలు బాదుకున్నా: కెరీర్ ఒడిదొడుకులపై Alia Bhatt
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అలియా భట్ తన కెరీర్ ఒడిదొడుకుల గురించి ఓపెన్ అయింది. ప్రస్తుతం తన భర్త రణ్‌బీర్‌తో కలిసి నటించిన నయా మూవీ 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబరు 9న విడుదలకాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. 2015లో వచ్చిన 'షాందార్' మూవీ పరాజయం పాలైనపుడు తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు చెప్పింది. అయితే అంతకుముందు తన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద 90 శాతం విజయం సాధించినప్పటికీ, ఈ ఒక్క వైఫల్యం కారణంగా కొంతకాలం ప్రశాంతంగా ఉండలేకపోయానని చెప్పింది.
కొన్ని విచిత్రమైన కారణాల వల్లే 'షాందార్' ప్లాఫ్ అయిందని తెలిపింది. 'మూవీ డిజాస్టర్ అయిందని చెబితే మొదట నమ్మలేకపోయా. తర్వాత నిజం తెలుసుకుని ఆఫీసుకు వెళ్లి గుండెలు బాదుకున్నా. ఆ సమయంలో నా తండ్రి సలహా మేరకు విహారయాత్రకు వెళ్లి రిలాక్స్ అయ్యాను. ఆయన సపోర్టుతోనే ఎంతటి వైఫల్యాలు ఎదురైనా బెదరకుండా ధైర్యంగా ఎదుర్కొంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: పెళ్లికి ముందే ఆ వ్యాధి బారిన పడిన Samantha.. అందుకే..
- Tags
- alia bhatt