అలియా భట్‌కు భర్త వేధింపులు.. తన పని తాను చూసుకున్నా..

by sudharani |   ( Updated:2023-11-16 14:22:24.0  )
అలియా భట్‌కు భర్త వేధింపులు.. తన పని తాను చూసుకున్నా..
X

దిశ, సినిమా : ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో విభేదాలున్నాయన్న సోషల్ మీడియా రూమర్స్‌పై స్పందించింది హీరోయిన్ అలియా భట్. హోస్ట్ కరణ్ జోహార్ ఈ పుకార్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘ఇది ఇంటర్నెట్ యుగం. వారానికి ఒక అపోహ ప్రచారంలోకి వస్తుంది. నాకు ఫ్యాట్ సర్జరీ జరిగిందని.. చర్మాన్ని తెల్లగా మార్చుకున్నానని.. వివాహంలో సమస్యలు వచ్చాయని.. ఇలాంటి వార్తలు నన్ను బాధించవు. వాళ్లు చేసేది వాళ్లు చేస్తారు.. నా పని నేను చేసుకుంటాను’ అని చెప్పింది. ఇక ట్రోలర్స్‌ కోసం ఆటోమేటెడ్ మెసేజ్ చేయవలసి వస్తే ఏం చేస్తావని కరణ్ అడగ్గా.. ‘హాయ్, దిస్ ఈజ్ అలియా భట్. మీరు చెప్పబోయేది మీకు మంచి అనుభూతిని కలిగిస్తే దయచేసి ముందుకు సాగండి’ అని సూచించింది. కాగా ఈ షోకు కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి హాజరైంది అలియ.

Read More..

రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన త్రిష

Advertisement

Next Story