నేను అలా కనిపించడం రణ్‌బీర్‌కు నచ్చదు.. పెళ్లికిముందే రూల్స్ పెట్టాడు

by Prasanna |   ( Updated:2023-08-18 05:03:44.0  )
నేను అలా కనిపించడం రణ్‌బీర్‌కు నచ్చదు.. పెళ్లికిముందే రూల్స్ పెట్టాడు
X

దిశ, సినిమా : పెళ్లికి ముందు తన అభిరుచులు, అలవాట్లను రణ్‌బీర్ రిసీవ్ చేసుకున్న తీరుపై ఓపెన్ అయింది అలియా భట్. కొంతకాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే డేటింగ్ సమయంలో రణ్‌బీర్ తనతో ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ మేకప్ విషయంలో మాత్రం రూల్స్ పెట్టేవాడని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది అలియా. ‘ఇప్పుడు ఆయన నా భర్త. కానీ నన్ను పెళ్లి చేసుకోముందు నా బాయ్‌ఫ్రెండ్‌ అయిన రణ్‌బీర్‌తో రాత్రిపూట బయటికి వెళ్లేదాన్ని. అప్పుడు నా ఫేస్ బాగా గమనించేవాడు. మేకప్ ఎలా చేసుకున్నానో లేదో చూసేవాడు. లిప్‌స్టిక్ కనిపిస్తే చాలా వెంటనే దాన్ని తుడిచివేయమని చెప్పేవాడు. నేను లిప్‌స్టిక్‌లు పెట్టుకోవడం తనకు అస్సలు నచ్చదు. ఎందుకంటే నా పెదవుల సహజమైన రంగు అంటేనే తనకు చాలా ఇష్టం. ఇప్పటికీ అదే కోరుకుంటాడు’ అని తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘మీరు ప్రమాదంలో ఉన్నారేమో దయచేసి గమనించుకోండి’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story