- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా వల్ల పది కుటుంబాలకు సాయం అందినా చాలు: అలీ
దిశ, సినిమా: ప్రముఖ నటుడు అలీ పేద పిల్లల ఉన్నత చదువుల కోసం తనవంతు సాయం చేస్తున్నాడు. ఈ విషయం గురించి తాజాగా మీడియా సమావేశంలో వివరించిన ఆయన.. ‘గతేడాది ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లినపుడు అక్కడున్న తెలుగువారంతా కొంతమందికి సాయం చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే విష్ణురెడ్డి, శశి కొలికొండను పిలిచి తెలుగువారికి కూడా హెల్ప్ చేయాలని కోరాను. దీంతో 9 నెలల తర్వాత ఆర్వేన్సిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఇవో శశి ఆర్వేన్సిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి సంబంధించిన ఆస్ట్రేలియన్ బ్రూస్ మ్యాన్‌ఫీల్డ్‌ను ఇండియాకు తీసుకొచ్చారు.
టాలెంట్ ఉండి డబ్బుల్లేక ఇబ్బందిపడే పిల్లలకు సాయం చేయటానికి కంపెనీవారు సిద్ధంగా ఉన్నారు. నా వల్ల ఒక పది కుటుంబాలకి మంచి జరిగిన ఫరవాలేదనిపించింది. అందుకే ‘ఆర్వేన్సిస్ కంపెనీ’కి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌లా పని చేయడానికి ముందుకొచ్చా’ అన్నాడు. అలాగే ఎన్నో పేద కుటుంబాలకు సేవలందిస్తామన్న శశి కొలికొండ, బ్రూస్ మ్యాన్‌ఫీల్డ్.. మార్చి 3, 4న ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న ‘ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ సమ్మిట్’ కు హాజరవుతున్నామన్నారు.