పేరెంట్స్ విడాకులపై అలయ షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ

by Prasanna |   ( Updated:2023-04-26 14:34:00.0  )
పేరెంట్స్ విడాకులపై అలయ షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ
X

దిశ, సినిమా : తమ తల్లిదండ్రుల విడాకులపై అలయా ఎఫ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 1994లో పెళ్లి చేసున్న పూజా బేడీ-ఫర్హాన్ ఫర్నిచర్‌వాలా 2003లో వ్యక్తిగత విషయాల కారణంగా విడిపోగా వీరిద్దరికి అలయ, ఒమర్ ఫర్నిచర్‌వాలా జన్మించారు. అయితే ఇటీవల ఓ సమావేశంలో ‘పేరెంట్స్ డివోర్స్ మీపై ఎలాంటి ప్రభావం వేసింది?’ అనే ప్రశ్నకు బదులిస్తూ ఆసక్తికర విషయం వెల్లడించింది అలయ. నిజానికి చిన్న వయసులో ఉన్నందున ఆ విషయంపై పెద్దగా అవగాహన లేదని.. తమ జీవితంలో ఏదో ప్రమాదం, దారుణం జరుగుతున్నట్లు ఫీల్ కాలేదని చెప్పింది. ఎందుకంటే తమ తల్లిదండ్రులు ఒకరితో ఒకరు మర్యాదపూర్వకంగా, గొప్పగా నడుచుకునేవారన్న ఆమె.. ఈ రోజుకు కూడా వాళ్లను మంచి స్నేహితులుగా మాత్రమే చూశానని తెలిపింది. ప్రస్తుతం తాము పేరెంట్స్ నుంచి చాలా ప్రేమ పొందుతున్నట్లు పేర్కొంది.

Also Read: నిహారికకు నాగబాబు రెండో పెళ్లి ఫిక్స్ చేశారా?

Advertisement

Next Story