Akshay: ఆ విషయంలో తప్పంతా నాదే.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన అక్షయ్

by Prasanna |
Akshay: ఆ విషయంలో తప్పంతా నాదే.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన అక్షయ్
X

దిశ, సినిమా : భారీ అంచనాలతో రిలీజైన ‘సెల్ఫీ’ చిత్రం అభిమానులను నిరాశపరిచినందుకు బాధగా ఉందంటున్నాడు అక్షయ్. అంతేకాదు ఈ విషయంలో ప్రేక్షకులను నిందించకూడదని, తప్పంతా తనదేనంటున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో.. ‘ఇటీవల నా సినిమాల విషయంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా. ఒక దశలో నేను నటించిన 16 చిత్రాలు నిరాశపరిచాయి. మరో 8సినిమాలు అశించిన ఫలితం అందుకోలేదు. సినిమా హిట్ కాకపోవడంలో తప్పు నాదే. నేటి అభిమానుల ఆలోచనల్లో మార్పులొచ్చాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సరకొత్త కథలకోసం ఎదురుచూస్తున్నారని అర్థం చేసుకుంటున్నా. అలాంటి స్టోరీల కోసమే వెతుకుతున్నా. అయితే ఒక వ్యాపారంలో ఎప్పుడూ లాభం రాకపోవచ్చు. ప్రతిసారి విజయం సాధించకపోవచ్చు. అయినా ఈ ఫెయిల్యూర్ విషయంలో తప్పు నాదేనని ఒప్పుకుంటున్నా’ అంటూ అభిమానులను క్షమాపణలు కోరాడు అక్షయ్. ఇక ఈ ‘సెల్ఫీ’ మూవీ ఫిబ్రవరి 24న విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story