అక్షయ్ కోసం బారికేడ్ దూకిన అభిమాని: వీడియో వైరల్

by Javid Pasha |
అక్షయ్ కోసం బారికేడ్ దూకిన అభిమాని: వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'సెల్ఫీ'. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, నుష్రత్ భరుచా, డయానా పెంటీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 24న సినిమా థియేటర్లలోకి రానుంది. కాగా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది మూవీ టీమ్. ఇందులో భాగంగానే అక్షయ్ కుమార్ తాజాగా ఢిల్లీకి వచ్చారు. అభిమానులను కలిసేందుకు యూనివర్సిటీని సందర్శించాడు.

ఈవెంట్ సమయంలో ఒక అభిమాని అక్షయ్ పాదాలు తాకడానికి బారికేడ్ దూకాడు. వెంటనే గుర్తించిన సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని అదుపు చేసి పక్కకు తోసేశారు. దీంతో వెంటనే హీరో అక్షయ్ కల్పించుకుని అతన్ని పైకిలేపి హత్తుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



Advertisement

Next Story