Akshay kumar: అత్యధిక సెల్ఫీలతో స్టార్ హీరో గిన్నిస్ రికార్డ్

by Prasanna |
Akshay kumar: అత్యధిక సెల్ఫీలతో స్టార్ హీరో గిన్నిస్ రికార్డ్
X

దిశ, సినిమా : ఖిలాడీ అక్షయ్ కుమార్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ ఫిల్మ్ 'సెల్ఫీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పడం విశేషం. అభిమానులతో మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగిన అక్షయ్.. మోస్ట్ సెల్ఫీస్‌తో న్యూ వరల్డ్ రికార్డ్‌ను సెట్ చేశాడు. ఇదిలా ఉంటే 'సెల్ఫీ' నెగెటివ్ రివ్యూస్ పొందగా.. తన తల్లి చనిపోయినప్పటి నుంచి ఒక్క సక్సెస్ కూడా పొందలేకపోయానని కన్నీరు పెట్టుకున్నాడు. అమ్మ గుర్తొస్తుందని.. తనను చూడాలని ఉందని ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కలిసి నటించిన 'సెల్ఫీ'.. మాలీవుడ్ ఫిల్మ్ 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్.

Advertisement

Next Story