అది చూస్తే బాధగా అనిపించింది: Richa Chadha కాంట్రవర్సీ ట్వీట్‌పై Akshay Kumar

by Hamsa |   ( Updated:2022-11-25 10:11:52.0  )
అది చూస్తే బాధగా అనిపించింది: Richa Chadha కాంట్రవర్సీ ట్వీట్‌పై  Akshay Kumar
X

దిశ, సినిమా: భారత సైన్యాన్ని ఎగతాళి చేస్తూ రిచా చద్దా చేసిన ట్వీట్‌పై బీటౌన్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించాడు. 'గాల్వాన్ సేస్ హాయ్' అంటూ రిచా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో 'దేశ ద్రోహి' అంటూ రిచాపై ప్రజలు దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్‌లో స్పందించిన అక్షయ్.. రిచా ట్వీట్ చూసి బాధపడ్డానని, ఇలాంటి మాటలు తనతో పాటు దేశ ప్రజలను కూడా నిరాశకు గురిచేశాయని అన్నాడు. ఇన్‌స్టా వేదికగా ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ షేర్ చేసిన ఆయన.. 'ఇది చూస్తే బాధగా ఉంది. మన సాయుధ బలగాల పట్ల కృతజ్ఞత చూపనిది ఏదీ గొప్పది కాదు. వో హై తో ఆజ్ హమ్ హై' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఎవరినీ నొప్పించడం లేదా కించపరచడం తన ఉద్దేశ్యం కాదన్న రిచా.. వివాదానికి కారణమైన 3 పదాలు ఎవరినైనా నొప్పించినట్లయితే లేదా బాధపెట్టినట్లయితే బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లుగా పేర్కొంది.

Read More: షారుక్ నుంచి యాక్టింగ్ ట్రిక్స్ నేర్చుకున్నా: Vicky Kaushal

Advertisement

Next Story