డ్యాన్స్ ఇరగదీసిన మోహన్ లాల్-అక్షయ్ కుమార్..

by Vinod kumar |
డ్యాన్స్ ఇరగదీసిన మోహన్ లాల్-అక్షయ్ కుమార్..
X

దిశ, సినిమా: మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కలిసి స్టెప్స్ వేశారు. జైపూర్‌లో కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్ పెళ్లిలో ఇద్దరూ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన అక్షయ్.. 'నేను మీతో చేసిన ఈ డ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మోహన్ లాల్ సర్. ఖచ్చితంగా మరపురాని క్షణం' అని రాసుకొచ్చాడు.

ఇక దీనిపై స్పందించిన మోహన్ లాల్.. 'షేకింగ్ ఏ లెగ్ విత్ వన్ అండ్ ఓన్లీ అక్షయ్ కుమార్' అని రిప్లయ్ ఇచ్చాడు. ఇక ఈ పెళ్లికి కరణ్ జోహార్, అమీర్ ఖాన్, కమల్ హాసన్ కూడా హాజరయ్యారు. కాగా ఈ వీడియో నెట్టింట మారగా.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఫన్‌ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ రావాలని కోరుకుంటున్నామని, ప్రియదర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని అడుగుతున్నారు.

Advertisement

Next Story