- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Akshay Kumar: నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన స్టార్ హీరో.. దేవుడు అంటూ పొగిడేస్తున్న నెటిజన్లు
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తు్న్న ఈ మూవీని ముదస్సన్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. గత ఏడాది నుంచి వరుస ఫ్లాప్స్ ఎదురుక్కొంటున్న అక్షయ్.. ఇప్పుడు ఈ సినిమాపై తన హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా అక్షయ్ కుమార్‌కు నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు వెళ్తున్నారు అంటే.. వీడియో గ్రాఫర్లు హీరోహీరోయిన్ల వెంట పడతారు. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ వెళ్తుండగా.. ఓ వీడియో గ్రాఫర్ షూట్ చేస్తున్నాడు. అప్పుడు అతడు తన చొప్పు ఊడిపోయింది. అయితే.. మన స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన స్థాయిని సైతం లెక్కచెయ్యకుండా ఆ చెప్పును తన చేతితో తీసి వీడియోగ్రాఫర్‌కు అందించడంతో ఆయనపై నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. నువ్వు దేవుడువయ్యా అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.