భారతదేశాన్ని అవమానించిన స్టార్ హీరో.. వీడియో వైరల్

by Prasanna |   ( Updated:2023-02-08 16:05:16.0  )
భారతదేశాన్ని అవమానించిన స్టార్ హీరో.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గతంలోనూ గుట్కా పాన్ మసాలా వంటి ప్రకటనలతో నెటిజన్ల ఆగ్రహానికి బలైన ఆయన తాజాగా ఓ కన్సర్ట్ కోసం కొంతమంది సహనటీమనులతో కలిసి నార్త్ అమెరికా టూర్‌ వెళ్తున్న ప్రమోషనల్ వీడియో నెట్టింట పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు '100% ప్యూర్ దేశీ వినోదాన్ని ఉత్తర అమెరికాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సీటు బెల్ట్‌లను పెట్టుకోండి. మేము మార్చిలో వస్తున్నాం! ఖతార్ ఎయిర్‌వేస్' అని షేర్ చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా ఇందులో గ్లోబ్ తిరుగుతుండగా నటులంతా షూస్ వేసుకుని ఇండియా మ్యాప్‌పై నడుస్తూ దర్శనమివ్వడం భారతీయులకు నచ్చలేదు. ఇండియాను అగౌరవపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'అక్షయ్ కుమార్ కెనడియన్ పౌరుడు అయినంత మాత్రాన భారత్ మ్యాప్‌ తొక్కించాలా? ఇది కరెక్ట్ కాదు?', 'ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా..150 కోట్ల మందికి క్షమాపణలు చెప్పాల్సిందే' అని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story