Akshay Kumar: లెహంగాలో డ్యాన్స్ అదరగొట్టేసిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్

by Prasanna |   ( Updated:2023-05-19 13:27:12.0  )
Akshay Kumar: లెహంగాలో డ్యాన్స్ అదరగొట్టేసిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సరికొత్త అవతార్‌లో నెటిజన్లను ఆశ్యర్యపరిచాడు. ప్రస్తుతం ‘అక్షయ్ ది ఎంటర్‌టైనర్స్’ అనే పేరుతో నిర్వహిస్తున్న షోలో భాగంగా యూఎస్‌‌ టూర్‌లో ఉన్న ఆయన.. తాజాగా నోరా ఫతేహితోకలిసి అట్లాంటాలో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఇందులో మొదట షర్ట్‌లెస్‌గా స్టేజీపైకి వచ్చిన హీరో అదే లుక్‌లో తన అబ్స్‌ని ప్రదర్శిస్తూ అలరించాడు. ఆ తర్వాత తను వేసుకున్న బ్లాక్ డ్రెస్‌పైనే ఎరుపు రంగు లెహంగా ధరించి చిందులేస్తూ వీక్షకులను ఊర్రూతలూగించాడు. ఇక సాంగ్‌ ఊపందుకుంటున్న సమయంలో తన లెగంగా విప్పేసి నోరాతో దుమ్మురేపిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Next Story