Niharika : మెగా హీరోలను కాదని అక్కినేని హీరోను లైన్‌లో పెట్టిన నిహారిక.. మెగా డాటర్ కోసం చైతూ వస్తాడా మరి!

by Jakkula Samataha |
Niharika : మెగా హీరోలను కాదని అక్కినేని హీరోను లైన్‌లో పెట్టిన నిహారిక.. మెగా డాటర్ కోసం చైతూ వస్తాడా మరి!
X

దిశ, సినిమా : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె విడాకుల తర్వాత చాలా బిజీ అయిపోయింది. వరసగా సినిమాలు, సిరీస్‌లు నిర్మిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. ఇక కొణిదెల నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ బ్యూటీ చాలా బిజీ అయిపోయింది. మూవీ ప్రమోషన్స్ చేస్తుంది. అయితే ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సపోర్ట్ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పలు అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే వారందరూ బిజీగా ఉన్నారంటూ నిహారిక ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా మరో న్యూస్ వైరల్‌గా మారింది. కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ కానుండటంతో, ఆగస్టు5న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరబాద్లోని ఓ స్టార్ హోటల్‌లో జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా నాగచైతన్య వస్తున్నాడని సమాచారం. దీంతో మెగా హీరోలు అంతమంది ఉండగా ఈవెంట్‌కు అక్కినేని హీరో నాగచైతన్య రావడం ఏంటీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు నాగచైతన్యను నిహారిక ఎందుకు పిలిచింది అంటూ మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం తండేల్ సినిమా షూటంగ్‌లో ఉన్న చైతూ, నిహారిక కోసం వస్తాడో లేదో చూడాలి అంటున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story