Kalam Rakis Kathalu: ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్

by sudharani |
Kalam Rakis Kathalu: ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్
X

దిశ, సినిమా: ఎమ్.ఎన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా సినిమా ‘కాలం రాసిన కథలు’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్ నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్‌లో ఐదు కథల మధ్య ఉన్న లవ్ కంటెంట్, డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగా ఉన్నాయి. కొత్త వాళ్లు అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించారు. దర్శకనిర్మత ఎమ్.ఎన్. వి సాగర్ ఈ సినిమాను చాలా కాన్ఫిడెంట్‌గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. కచ్చితంగా ఈ మూవీ యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని చెబుతూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అలాగే దర్శన నిర్మాత మాట్లాడుతూ.. ‘నేను నా అభిమాన గురువుగా భావించే డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రాబోయే ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా. నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత పునర్జన్మలో ఊపిరి పోసుకున్న బంధాలు నమ్మకానికి మోసానికి మధ్య బలౌవుతున్న మనసు నలిగిపోయిన మనిషి జీవితాల్లో 30 సంవత్సరాల క్రితం మొదలైన పరువు హత్యల మధ్య ఈ కథ సాగుతుంది. సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. అంతే కాకుండా సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకులకి ఊహకందని అద్భుతమైన ట్విస్టులు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story