Vidaamuyarchi: అజిత్ ‘విదాముయార్చి’ రిలీజ్ అప్డేట్ .. వైరల్ అవుతున్న పోస్ట్

by Prasanna |   ( Updated:2024-08-25 14:30:51.0  )
Vidaamuyarchi: అజిత్  ‘విదాముయార్చి’ రిలీజ్ అప్డేట్ .. వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను తీసే ఏ సినిమా అయినా ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి పాత్రలకి అజిత్ వంద శాతం న్యాయం చేయగలడు. తాజాగా అజిత్, త్రిష కలిసి నటించిన మూవీ ‘విదాముయార్చి’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లైకా పతాకం పై మగిజ్ తిరుమేని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా హీరో, హీరోయిన్ల ఫోటోలు అందర్ని ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ‘విదాముయార్చి’ రిలీజ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింటి బాగా హల్చల్ చేస్తుంది. ఈ మూవీని అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ ఒకటి వైరల్ అవుతుంది. అయితే, దీనిపై ఇంకా మూవీ మేకర్స్ అధికారిక అనౌన్స్ చేయలేదు. కానీ గత రెండు రోజుల నుంచి కోలీవుడ్ లో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. భార్యాభర్తలు ఇష్టంగా ఓ ట్రిప్ కు వెళ్తారు .. అక్కడ ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అలా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ట్రిప్ లో భార్య తప్పిపోతోంది.. ఆమెను వెతికే ప్రయత్నంలో భర్తకు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది ఈ కథ. ప్రేక్షకులను మెప్పిస్తుందో.. లేదో చూడాలి మరి!

Advertisement

Next Story