- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ డైరెక్టర్ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్.. తన అదృష్టమేనంటూ
దిశ, సినిమా : ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో తాను పోషించిన నందిని పాత్ర ఎప్పటికీ ప్రత్యేకమైనదేనంటోంది ఐశ్వర్యరాయ్. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే. 1999లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’లో నందిని పాత్ర చేశా. ఆ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. ఇప్పుడు నా గురువు మణిరత్నం డైరెక్షన్‌లో మళ్లీ అలాంటి పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ధైర్యవంతురాలైన మహిళల పాత్రల్లో నటించడం నా అదృష్టమే. ఇది నాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం’ అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. అలాగే ఇదే సమావేశంలో తనపై మణిరత్నం ప్రశంసలు కురిపిస్తుంటే భావోద్వేగానికిలోనైన ఐశ్వర్య.. ఆయన కాళ్లు మొక్కడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.