శ్రీవల్లి పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్‌.. రష్మిక రియాక్షన్ ఇదే పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-20 12:21:38.0  )
శ్రీవల్లి పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్‌.. రష్మిక రియాక్షన్ ఇదే పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇటీవల పుష్ప సినిమాలో రష్మిక మందన పోషించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటయ్యేదని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో రష్మిక ఫ్యాన్స్ ఐశ్వర్యను ట్రోలింగ్ చేశారు. దీనిపై ఐశ్వర్య స్పందించింది. తన మాటల్ని కొందరు వక్రీకరించారని, రష్మిక మందన ని కించపరిచేలా ఎక్కడా మాట్లాడతేదని తెలిపింది. పుష్పలో రష్మిక నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, ప్రచారాలతో ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించొద్దని ఐశ్వర్య అభిమానులకు విజ్ఞప్తి చేసింది. తాజాగా, దీనిపై శ్రీవల్లి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘ఈ వివాదం కాస్త ఆలస్యంగా నా దృష్టికి వచ్చింది. ఐశ్వర్య.. నువ్వేమిటో నాకు తెలుసు. నీ మాటల్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మీద నాకు గొప్ప గౌరవం ఉంది. ‘ఫర్హానా’ చిత్రంలో నీ నటన అద్భుతంగా ఉంది’’ అంటూ ప్రశంసలు కురిపించింది.

Read More: తగిన మ్యాచ్ కోసం వెతుకుతున్న సమంత.. ఆ విషయంలో హామీ కూడా ఇస్తుందట!

Advertisement

Next Story