టాక్స్ ఎగ్గొట్టిన ఐశ్వర్యరాయ్.. నోటీసులు జారీ

by Prasanna |   ( Updated:2023-01-18 06:42:29.0  )
టాక్స్ ఎగ్గొట్టిన ఐశ్వర్యరాయ్.. నోటీసులు జారీ
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాల్లో నటించి ఆమె స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే.. దాదాపు ఏడాది నుంచి ఆమె సిన్నార్‌లోని తన భూమికి సంబంధించిన టాక్స్ చెల్లించలేదట. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇక్కడ ఐశ్వర్యరాయ్ మాత్రమే కాదు, మరో 1200 మంది కూడా టాక్స్ కట్టకపోవడంతో వారికి కూడా అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం. వీటిని అందుకున్న వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఎగ్గొట్టిన టాక్స్‌తో ప్రభుత్వానికి రూ. 1.11 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Also Read....

నాకో బాయ్ ఫ్రెండ్ కావాలి : సురేఖవాణి.. అది పొడుగ్గా, బాగా ఉండాలని కండిషన్

జాన్వీ క్యారెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన అర్జున్

Advertisement

Next Story