ఐశ్వర్యా రాయ్ మీద పడిన చిరంజీవి కన్ను.. ఈ సారైనా వర్కవుట్ అయ్యేనా?

by Anjali |   ( Updated:2023-09-19 10:04:27.0  )
ఐశ్వర్యా రాయ్ మీద పడిన చిరంజీవి కన్ను.. ఈ సారైనా వర్కవుట్ అయ్యేనా?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. అయితే లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుండగా.. మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాయ్ పేరు వినిపిస్తుంది. ఈ మాజీ ప్రపంచ సుందరి తెలుగు తెరపై ఇప్పటివరకు ఒకే ఒకసారి సందడి చేసింది. అది కూడా 24 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన ‘రావోయి చందమామ’ మూవీలోని ఓ ఐటమ్ సాంగ్‌‌లో అలరించింది. గతంలో కూడా చిరుతో ఐష్ జోడీ కట్టనున్నట్లు టాక్ వినిపించింది. కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక ఈ సారైనా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement

Next Story