ఐశ్వర్యకు చెట్టుతో పెళ్లి జరిపించిన బచ్చన్ ఫ్యామిలీ.. చాలా చెత్తగా అనిపించిందన్న నటి

by sudharani |   ( Updated:2023-11-01 10:33:02.0  )
ఐశ్వర్యకు చెట్టుతో పెళ్లి జరిపించిన బచ్చన్ ఫ్యామిలీ.. చాలా చెత్తగా అనిపించిందన్న నటి
X

దిశ, సినిమా : అభిషేక్ బచ్చన్‌తో మూడుముళ్లు వేయించుకోక ముందు తనకు చెట్టుతో పెళ్లి జరిపించారనే వార్తలపై ఐశ్వర్య రాయ్ ఓపెన్ అయింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. కెరీర్ అండ్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఏదో దోషం కారణంగా అభిషేక్‌తో పెళ్లి కంటే ముందు తాను చెట్టును మ్యారేజ్ చేసుకున్నట్లు లేనిపోని పుకార్లు పుట్టించారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘నా మంగళసూత్రంపై దోషాన్ని తొలగించడానికి ఒక చెట్టుతో మ్యారేజ్ చేసుకోవాలని బచ్చన్ కుటుంబం నన్ను కోరిందని నమ్మేవారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అయితే అంతర్జాతీయ మీడియా సైతం ఈ విషయంపై నన్ను ప్రశ్నించినప్పుడు చెత్తగా అనిపించింది. చాలా షాక్ అయ్యాను. దోషం గురించి అడిగినపుడు ఓ మై గాడ్.. నేను దీనిపై ఎలా మాట్లాడాలి? అని ఆశ్చర్యపోయాను. ఒక దశలో విసుగు చెందాను. నిజంగా ఆ చెట్టు ఎక్కడ ఉందో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే దయచేసి నాకు చూపించండి. నేను వివాహం చేసుకున్న ఏకైక వ్యక్తి అభిషేక్. బహుశా అతడే కావొచ్చు మీరు అనుకునే చెట్టు’ అంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది. ఇక ఈ విషయాన్ని అమితాబ్ కూడా ఖండించాడు.

Advertisement

Next Story

Most Viewed