కెమెరా మాకు సరస్వతి తో సమానం: Aishwarya Rai

by Harish |   ( Updated:2022-10-10 14:19:44.0  )
కెమెరా మాకు సరస్వతి తో సమానం: Aishwarya Rai
X

దిశ, సినిమా: కెమెరాతో తనకున్న బంధంపై ఐశ్వర్యరాయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఐశ్వర్య ఇటీవల మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్‌'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నఆమెను .. మీరు కెమెరా ని ప్రేమిస్తున్నారా? లేదా కెమెరా మిమ్మల్ని ఇష్టపడుతుందా? అని అడిగారు.

దీనికి సమాధానంగా 'నేను నా పనిని ప్రేమిస్తున్నా. కెమెరా ఒక ఖచ్చితమైన సాధనం. అయితే అది మా జీవితాల్లో ముఖ్యమైన భాగం. కెమెరా లేకుంటే మేము చేయాలనుకున్నది మీకు చెప్పలేం. ఇది వాయిద్యం లేని సంగీతకారుడిలా ఉంటుంది. మా నటన, అందం, ఆలోచనలు, తత్వాలు ఏవైనా దీనితోనే వెల్లడిస్తాం. కాబట్టి ఇది మా సరస్వతి' అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.

వెండితెరపై చూపించేది కేవలం 3 గంటలే అయినా ఏడాది పొడవునా జరిగే ప్రక్రియలో తమతో భాగమవుతుందన్న ఆమె.. అందుకే కెమెరాను స్పెషల్‌గా చూస్తానని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి : ఎయిర్ హోస్టెస్‌గా అనసూయ.. ఆ ఆరుగురిని ఏం చేసింది


Advertisement

Next Story