అతను గుడి అని కూడా చూడకుండా నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు: Aishwarya Lakshmi

by Harish |   ( Updated:2022-12-07 06:28:31.0  )
అతను గుడి అని కూడా చూడకుండా నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు: Aishwarya Lakshmi
X

దిశ, సినిమా: మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య లక్ష్మి. ( Aishwarya Lakshmi ) సౌత్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. కాగా ఈ హీరోయిన్ నటించిన తాజా చిత్రం 'మట్టి కుస్తీ' విడుదలయ్యి థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది ఐశ్వర్య. ఇలా ఒక ఇంటర్వ్యూలో తాను కూడా చిన్నప్పుడు ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది.

ఐశ్వర్య మాట్లాడుతూ "ప్రతి మహిళ తన జీవితంలో ఏదో ఒక చెడు స్పర్శను అనుభవించే ఉంటుంది. ఇది ప్రతి ఒక అమ్మాయికి పెద్ద సమస్యే. నాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. చిన్నప్పుడు కేరళలోని గురువాయూర్ లో ఓ సంఘటన జరిగింది. ఇప్పటికీ అది నాకు గుర్తుంది.

నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు గురువాయుర్ ఆలయానికి వెళ్ళినప్పుడు నాతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ పార్ట్స్ తాకి నాతో చండాలంగా ప్రవర్తించాడు. ఆరోజు నేను పసుపు రంగు దుస్తులు ధరించాను. అప్పటి నుంచి ఆ రంగు బట్టలు వేసుకోవాలంటే భయపడతాను. ఆ సమయంలో నేను చిన్నపిల్లను అందుకే రియాక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు ఏ భయం లేదు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన సినిమా ప్రమోషన్ లో కూడా ఇలాంటి ఘటన ఎదురైంది జరిగింది. ఇప్పుడు నేను రియాక్ట్ కాగలను'' అంటూ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read...

Tollywood లో ఫ్రాంచైజీలుగా విడుదల అయ్యే సినిమాలు ఇవే !

Advertisement

Next Story