విడాకులు తీసుకోబోతున్న ఐశ్వర్య, అభిషేక్..! ఆ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ

by sudharani |   ( Updated:2024-04-21 14:21:48.0  )
విడాకులు తీసుకోబోతున్న ఐశ్వర్య, అభిషేక్..! ఆ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ అందరికీ సుపరిచితమే. ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2007లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు.. ఓ కూతురు కూడా ఉంది. అయితే.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీటికి తోడు గతంలో ఐశ్వర్య రాయ్ తన కూతురితో కలిసి 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నప్పుడు.. తల్లి, కూతుర్లు మాత్రమే ఈ వేడుకలో ఉండటం విడాకుల వార్తలకు ఆజ్యం పోసినట్లు అయింది.

దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం కన్ఫార్మ్ అంటూ నెట్టింట గట్టిగానే చర్చలు నడుస్తున్నాయి. కానీ ఈ విడాకుల వార్తలపై ఐశ్వర్య కానీ, అభిషేక్ కానీ స్పందించలేదు. అయితే.. తాజాగా ఐశ్వర్య రాయ్ పెట్టిన పోస్ట్ మాత్రం విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో ఉన్న ఫొటోను తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ కావడంతో ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది. అంతే కాకుండా బ్యూటీఫుల్ ఫ్యామిలీ అంటూ నెట్టింట కామెంట్లతో సందడి చేస్తున్నారు నెటిజన్లు.

Read More...

భర్తను పక్కన పెట్టుకుని ప్రియుడు సెక్సీగా ఉన్నాడంటున్న హీరోయిన్.. ఆయనలో ఏం నచ్చిందో.. ఛీ ఛీ.. ఏంటీ ఈ బిహేవియర్...

Advertisement

Next Story