చిరంజీవి-సురేఖకు మధ్య ఎన్నేళ్లు ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..? ఎవరు పెద్దంటే?

by Anjali |   ( Updated:2024-02-21 15:25:21.0  )
చిరంజీవి-సురేఖకు మధ్య ఎన్నేళ్లు ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..? ఎవరు పెద్దంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన అద్భుతమైన నటన, డాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవలే ఉత్తమ నటుడిగా పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకుని.. ముఖ్యమంత్రి, గవర్నర్ చే ప్రశంసలు అందుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే..

చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహమాడిన విషయం తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లల సంతానం. సినిమా ఇండస్ట్రీతో సురేఖకు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఫ్యాన్స్ మెగాస్టార్‌కు ఎంత అభిమానం చూపిస్తారో ఈమెను కూడా అంతే గౌరవిస్తారు. బయట ఎక్కువగా కనిపించకున్నా సురేఖ పలు కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.

ఇకపోతే తాజాగా మెగాస్టార్-సురేఖ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటూ నెట్టింట మెగా ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వీరిద్దరికి 1980 లో వివాహం అవ్వగా.. అప్పటికి చిరు సతీమణి వయసు 22 ఏళ్లు ఉన్నాయి. చిరంజీవికి 25 సంవత్సరాలు ఉన్నాయి. అంటే వీరిద్దరికి వయసు తేడా.. 3 ఏళ్లు. సురేఖ ఫిబ్రవరి 18వ తారీకున 1958లో జన్మించగా.. మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించారు.

Read More..

43 ఏళ్ల సంసార జీవితంలో..ఒక్కసారి కూడా సురేఖతో అలాంటి పని చేయని చిరంజీవి!

Advertisement

Next Story