అమితాబ్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్? వీడియో వైరల్

by Vinod kumar |
అమితాబ్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్? వీడియో వైరల్
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ నైట్ పార్టీలో అగస్త్య, సుహానాలకు సంబంధించిన రొమాంటిక్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో వీరిద్దరు ప్రేమలో పడ్డారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు ఈ స్టార్ కిడ్స్ ఇద్దరూ ‘ఆర్చీస్‌’ మూవీ ద్వారా అరంగేట్రం చేయనుండగా.. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఒకరినొకరు తరుచుగా కలుసుకోవడం, పార్టీలు ముగించుకుని వెళ్తున్నపుడు హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడం ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ తానియా ష్రాఫ్ పుట్టినరోజు వేడుకకు హాజరవగా.. సుహానాను దగ్గరుండి కారు ఎక్కించిన అగస్త్య ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story