మొదలైన ‘Salaar’ అడ్వాన్స్‌ బుకింగ్స్.. హాట్ కేకుల్లా కొంటున్న ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2023-09-01 15:24:21.0  )
మొదలైన ‘Salaar’ అడ్వాన్స్‌ బుకింగ్స్.. హాట్ కేకుల్లా కొంటున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత్‌ నీల్‌- ప్రభాస్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్‌. ఈ సినిమా టికెట్స్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది. విడుదలకు నెల రోజుల ముందే ఈ సినిమా అమెరికాలో రికార్డు సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా, అమెరికాలో ‘సలార్‌’ టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించగా, అవి హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీనికి సంబంధించిన పోస్టర్లు ట్విటర్‌లో దర్శనమిస్తున్నాయి. వాటిని ప్రభాస్ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘కేజీఎఫ్‌’ సినిమా కూడా విదేశాల్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో సినీ ప్రియులంతా ‘సలార్‌’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా విడుదలైన దీని టీజర్‌ వాటిని రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదలకానుంది.

సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి ప్రమోషన్స్‌ను షురూ చేయనున్నారట మూవీ టీమ్.త్వరలోనే ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం. అలాగే ‘సలార్‌’కు సంబంధించిన మరో వార్త కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలు ‘కేజీఎఫ్‌’ను మించి ఉంటాయని అంటున్నారు. క్లైమాక్స్‌లో ప్రభాస్‌ 1000 మందితో ఫైట్‌ చేయనున్నారట. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.రెండు పార్ట్ లుగా ఈ సినిమా రూపొందుతోంది.

ఇవి కూడా చదవండి : ఊహకందని రేంజ్‌‌లో ‘Salaar’ బిజినెస్‌.. నైజాంలో ఎన్ని కోట్లు పలికిందో తెలుసా?

Advertisement

Next Story